క్రిటికల్ థింకింగ్ (Critical Thinking)

క్రిటికల్ థింకింగ్ ఇప్పుడు అన్ని రంగాల్లోను వినిపిస్తున్న నూతనమైన భావన. దీని వేళ్లు ప్రాచీన కాలంలోనే ఏర్పడిపోయిననప్పటికీ ఇది ఆధునిక, ప్రాపంచిక సమస్యలను ఎదుర్కోవడానికి సమకాలీన పరిశీలనలతో జోడించి మరింత మెరుగైన విధానంలో ఉపయోగించడం జరుగుతుంది. నిపుణులంతా ఇప్పుడు క్రిటికల్ థింకింగ్‌ను ఒక అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. కార్యరంగంలో విజేతలు కావడానికి దీనిని ఒక సాఫ్ట్ స్కిల్‌గా పరిగణించడం జరుగుతోంది. అందుచేత క్రిటికల్ ధింకింగ్ ఎలా మొదలుపెట్టాలి…ఎలా కొనసాగించాలి..ఏయే అంశాలు పరిగణించడం జరుగుతుందనేది ఒక ఆసక్తికరమైన అంశంగా మారడం విచిత్రం కాదు. దానిలో ముఖ్యంగా ప రిశీలన, విశదీకరణ, విశే్లషణ, పరిశోధన, మూల్యాంకనం, వివరణ, ఇంకా మెటా-కాగ్నిషన్ (పార భౌతికమైన సంజ్ఞానం) వంటివి ముడిపడి ఉంటాయి. ఇప్పుడు నిపుణులు అంతా క్రిటికల్ ధింకింగ్ ద్వారా తమకు ఎదురుగా ఉన్న సవాళ్లను ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటివారు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఇవి.
1. పరిశీలన ద్వారా తెలుసుకున్న ఆధారాలు
2. నెలకొని ఉన్న నేపథ్యం (కాంటెక్స్ట్)
3. సరైన జడ్జిమెంట్ చేయడానికి కావాల్సిన సంబంధిత ప్రామాణికత
4. జడ్జిమెంట్‌ను రూపొందించడానికి చేపట్టాల్సిన టెక్నిక్‌లు, సాధన చేయదగ్గ పద్ధతులు
5. ప్రస్తుతం ఎదురుగా ఉన్న సమస్య లేదా ప్రశ్నను అర్ధం చేసుకోవడానికి సాధన ప్రయోగం చేయదగ్గ సైద్ధాంతిక నిర్మాణాలు.
సమస్యా పూరణానికి ఇటువంటి క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాన్ని అమవరుచుకోవడంతో బాటుగా కొన్ని స్వాభావిక లక్షణాలను సైతం అలవరుచుకోవాల్సి ఉంటుంది

1. సమస్య ఎదురవ్వగానే షాక్‌కు గురికాని విధంగా ఉండే అచంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి.
2. ఉద్వేగ నిర్వహణ సామర్ధ్యం ఉండాలి.
3. సమస్యను పరిష్కరించడానికి సంసిద్ధత సత్వరంగా ఏర్పడాలి.
4. తర్కబద్ధత చాలా అవసరం.
5. సంబంధిత శాఖలో బుద్ధికుశలత తప్పనిసరి.
6. విస్తారమైన పరిజ్ఞానం
7. చురుకుదనం
8. సమకాలీన వ్యవస్థపైన, సమకాలీన సంస్థాగత వ్యవస్థపట్ల సరైన అవగాహన
9. స్పష్టతతో కూడుకున్న ఆలోచన
10. సాంకేతిక భావాలలో కచ్చితత్వం
11. సంక్షిప్తత
12. సమస్యకు సంబంధించిన సంభావ్యత, సమస్య వ్యాప్తి, విస్తరణ, ప్రాముఖ్యత, తీవ్రత అలాగే సంబంధిత సమస్య నెలకొనడానికి దారితీసిన పరిస్థితులపట్ల రాగరహితమైన దృక్పథం మొదలైనవి ఉండాలి.

ప్రస్తుత కాలంలో సాంకేతికాభివృద్ధి విస్తారంగా పెరిగింది. సరళీకృత ఆర్థిక విధానం, ప్రపంచీకరణ సమానంగా మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రాచీన భావాలు, సమస్యా పూరణాల పద్ధతి ఇప్పడు కాలం చెల్లిపోయిన భావాలుగా కన్పిస్తున్నాయి. వాస్తవానికి ప్రాచీన కాలంలోనే ఇటువంటి క్రిటికల్ థింకింగ్ ఉండేదని బోధించే వారని మనకు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఇంతవరకు క్రిటికల్ థింకింగ్ అనే ఒక విషయం ఉన్నదన్న సంగతి తెలియకపోవడానికి అవసరం రాకపోవడం కారణం కావచ్చు. పురాతన కాలంలో మన జీవితాలు మరీ ఇంత సమస్యా వలయాలుగా ఉండి ఉండకపోవచ్చు. లేదా నాటి కాలమాన పరిస్థిత్లు సమస్యా పూరణానికి విస్తృత స్థాయిలో ప్రాధాన్యత లేకపోవడం కావచ్చు లేదా నాడు ఎదురైన సమస్యలు ఇంత తీవ్రమైన స్థాయిలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు లేకపోవడం కావచ్చు లేదా సమస్యలు కేవలం బుద్ధి కుశలత ప రిధిలోనే తేలికగా పరిష్కారం చేయదగిననవి అయి ఉండవచ్చు. ఏదైనప్పటికీ క్రిటికల్ థింకింకన్నా థింకింగ్‌కే ఎక్కువ విలువ, ఫలితాత్మకతను ఆపాదించడం జరుగుతూ వచ్చింది. మన దేశంలో బౌద్ధుల కాలంలోనే ఇటువంటి విశే్లషణా పూర్వకమైన ఆలోచనా విధానాన్ని ఉపయోగించి సమస్యా పూరణం సాధించడం జరిగిందని లేదా బోధన ఉండేదని మనకు తెలుస్తోంది. ఒక కార్యనిర్వహణా సామర్ధ్యాన్ని ప్రతిఫలింపచేయడంలో భారతదేశ మేథో సంపత్తి ఇతర దేశాలకు మార్గదర్శకత్వం ఇచ్చే స్థాయిలో ఉండేదని మనకు తెలుసు. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనకు ఎదురుగా ఉన్న సవాళ్లను ప్రతిఘటించడానికి పలు రకాల నైపుణ్యాలను సంతరింపచేసుకుంటున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు పలు సాధన ప్రయోగం చేయదగ్గ సూత్రాలతో ఆ నైపుణ్యాలను వివరించడం జరిగింది. కాబట్టి వాటిని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడం ద్వారా గెలుపుదారిని మరింత సులభం చేసుకోవచ్చునని అనేది నిర్వివాదాంశం. ఈ నైపుణ్యాలు కేవలం కార్యరంగానికి మాత్రమే పరిమితమని భావించడం తగదు. మనిషన్నాక ఎవరికైనా సమస్యలొస్తాయి. కుటుంబంలో సమస్యలు, ఉద్యోగాల్లో సమస్యలు, స్నేహ సంబంధాల్లో సమస్యలు, ప్రేమ సమస్యలు, బంధువుల సమస్యలు. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు తప్ప ఇంకేమున్నాయి మన జీవితంలో అనిపించే స్థాయిలో సమస్యలు ఉన్నాయి. వాటినన్నింటినీ క్రిటికల్ థింకింగ్ ప్రక్రియ తీర్చకపోయినా సులభతరం చేస్తుంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s