గెలుపుదారి (The Way to WIN)

జీవితంలో మీకు కావాల్సింది పొందాలంటే మీ ‘కలలు’..మరిచిపోయిన కలలు..మీ అలక్ష్యానికి గురైన మీ కలలు మీకు తెలియాలి. అవి మీ ఆశయాలను బయటపెడతాయి. మీ కార్యశీలతకు ఊపిరులూదుతాయి. ఇతరులకు మీకు గల తేడాను రూపుదిద్దుతాయి.
‘వ్యధ’ మీకు స్నేహితుడే!
మీకు కావాల్సిందేదో పొందడానికి మీరు మీ చర్యలను అడ్డుకుంటున్న దేమిటో తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో మీరు చేయకుండా వాయిదా వేస్తూ ఉన్న పని ఏదైనా ఉంటే దానిని తీసుకోండి. ఆ పనిని ఎందుకు చేయలేకపోతున్నారో ఆలోచించండి. బహుశా ఆ ప ని చేయడం మీకు కంటకంగా పరిణమించి ఉండవచ్చు. హఠాత్తుగా మీకున్న గడువు తగ్గిపోతుంది. ఒక్కసారిగా మీరు ఆ పనిని పూర్తి చేయడానికి ఉపక్రమిస్తారు. ఇంతవరకు ఏర్పడిన బద్ధకం కాస్తా తృటిలో మాయమవుతుంది. ఆ పనిని పూర్తి చేయడానికి మీకున్న కాల వ్యవధి సరిపోక పూర్తిగా ఆ పనిని చేయడం మానివేయవచ్చు. లేదా చేసినప్పటికీ సంతృప్తికరంగా చేయకపోవచ్చు. ఒక పనిని అసలు చేయకుండా నిలిపివేయడం లేదా అసంతృప్తికరంగా పూర్తి చేయడం…మరింత కంటకంగా మిమ్మల్ని బాధిస్తుంది. అందుచేత మీరు మీ ఆలోచనా వైఖరిని మార్చుకోండి. ఒక పనిని చేయడం కంటకంగా అనిపించినపుడు…ఆ పనిని చేయడం మానేయడం మరింత కంటకమైనదని గ్రహించండి. ఆ వైషమ్యాన్ని గ్రహించండి. గుర్తించండి. ‘నేను ఈ పనిని చేయకపోతే ఏర్పడే నష్టం మరీ ఎక్కువైందని తలపోయండి. వ్యధను స్నేహితునిగా భావించి కంటకమైన దానే్న ముందుగా చేయడానికి త్వర పడండి.
సుఖదుఃఖాలు
మీ గమ్యాన్ని రూపొందించేవి ఇవే. ఏది మనకు సుఖాన్ని ఇస్తుందో, ఏది మనకు అపరిమితమైన దుఃఖాన్ని కలిగిస్తుందో మనం తెలుసుకోగలం. వ్యధను సంతోషంగా మలుచుకోగల సామర్ధ్యం మనకు సమృద్ధిగా ఉంది. అయితే కొందరు బాధలకు లొంగిపోయి తాగుబోతులుగా మారితే మరికొందరు ఆ బాధను మర్చిపోవడానికి ఏదో ఒక రంగంలో కృషి చేసి గొప్పవారవుతారు. నష్టంకన్నా లాభం చాలా గొప్పది. మీరు గత అయిదు సంవత్సరాల్లో కష్టపడి సంపాదించుకున్న లక్ష రూపాయలు ఎవరైనా పట్టుకుపోతారేమోనని బెంగపెట్టుకుంటూ గడపడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తారా? లేక ఐదు సంవత్సరాల కాలంలో రెండు లక్షల రూపాయలు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నారా? ఏదంటే మీ కిష్టం. చాలామంది తాము సంపాదించుకున్నది పోతుందేమోనని వ్యధతోనే కాలం గడిపేస్తారు. కులాంతర వివాహానికి ఒప్పుకుంటే వంశ ప్రతిష్ట పోతుందేమోనని భయపడే తండ్రి, తన కుమారుడు మరో కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నందువల్ల సామాజిక స్పృహ కలిగిన తండ్రిగా తనకు లభించే కీర్తిని గురించి ఆలోచించడు.
గొప్పవాళ్లు (విజేతలు) అదృష్టవంతులా?
కానే కాదు. వారిలో నిక్షిప్తమై ఉన్న అపూర్వ మానవ వనరులను యుక్తిగా ఉపయోగించుకున్నారంతే..
మూరెడు ముందుకు బారెడు వెనక్కు
ఒకడుగు ముందుకు వేస్తే నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయనే ఫీలింగ్ ఉందా? అంటే మీ లక్ష్య సాధన పట్ల మీకు ఆనందం, విచారం, రెండూ సరిసమానంగా ఉన్నాయన్నమాట. మిమ్మల్ని మీరే పతనానికి గురి చేసుకునే పరస్పర విరుద్ధమైన భావోద్వేగాలను మీరు కలిగి ఉన్నారన్నమాట. ఇవి ఉన్న వారికి సక్సెస్ అందించే ఉత్కంఠభరితమైన ఆనందం ఎటువంటిదో రుచి తెలియదు.
ఎవేర్‌నెస్ ముఖ్యం
మీకు పది లక్షలు సంపాదించాలని ఉంది. అయినా అందుకోసం మీరేమీ చేయడంలేదు. కారణం ఏమిటి? మీరనుకున్నది సాధించకుండా నిలిపేది ఏమిటి? ఆ సాధన పట్ల మీకు నెగటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయన్న మాట. కాగితం తీసుకుని దిగువన మీ పైన మీ లక్ష్యాన్ని రాయండి. లక్ష్యంతో ముడిపడి ఉన్న పాజిటివ్, నెగిటివ్ భావాలను విడివిడిగా రాయండి. ఖచ్చితంగా మీకు నెగిటివ్ భావాల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అవి ఏమిటో సరిగ్గా చదవండి. అర్ధం చేసుకోండి. వాటికి వౌలికమైన ఆధారాలు ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఆధార రహితమైన వాటిని తొలగించండి.
బద్ధకం ఎప్పుడూ పక్కనే ఉంటుంది
మనిషి సుఖ జీవి కదా! ఏ పనినైనా రేపు చేద్దాంలే అనుకుంటాడు. ఆ ‘రేపు’ అనే పదం అద్దెకు ఎవ్వరూ రాని ఇంటికి వేళ్లాడే ‘టులెట్’ బోర్డులా ఎప్పుడూ వేళ్లాడుతునే ఉంటుంది

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s